టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

 


టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉద్యమ ద్రోహులు ఎవరో, ఉద్యమ కారులు ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలుసునని అన్నారు. పల్లా లాంటి నేతల గురించి మాట్లాడే స్థాయిలో లేనని అన్నారు. ప్రగతి భవన్ కేంద్రంగా స్క్రిఫ్ట్ రాసి ఇస్తే చదివే మనుషులని, మరమనుషులని, వారికి ఆ స్ఫూర్తి, చేవ లేదన్నారు. వాళ్లు ఎప్పుడు వచ్చారో, వాళ్ల చరిత్ర ఏంటో తాను చెప్పాల్సిన పనిలేదన్నారు. ఈటల రాజేందర్ శ్రమ, పోరాట పటిమ తెలంగాణ ప్రజలకు తెలుసునని అన్నారు. తన గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ల చరిత్ర కాలగర్భంటో కలిసిపోతుందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.