ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టాలీవుడ్‌లో కొత్త రికార్డులను క్రియేట్

 


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టాలీవుడ్‌లో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నారు. 'అల వైకుంఠపురములో' చిత్రంలోని పాటలతో ఇప్పటికే కనీవినీ ఎరుగని రికార్డు క్రియేట్ చేసిన అల్లు అర్జున్.. ఇప్పుడు తన తాజా చిత్రం 'పుష్ప' ఇంట్రడక్షన్ వీడియోతోనూ రికార్డులను క్రియేట్ చేస్తున్నారు. పుష్ప రాజ్ పాత్రను పరిచయం చేస్తూ అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఈ వీడియో అద్భుతమైన స్పందనను రాబట్టుకుంటూ.. విడుదలైన క్షణం నుంచి రికార్డులను తిరగరాస్తూ ముందుకు దూసుకుపోతుంది. తెలుగు ఇండస్ట్రీలో 70 మిలియన్ వ్యూస్ మార్క్ అందుకున్న తొలి ఇంట్రడక్షన్ వీడియోగా అల్లు అర్జున్ పుష్ప వీడియో చరిత్ర సృష్టించింది. తెలుగు ఇండస్ట్రీలో ఇటువంటి రికార్డ్ ఇప్పటి వరకు ఏ హీరోకీ లేదు.


కేవలం తెలుగులోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా బన్నీ తన మార్కెట్‌ను పెంచుకునేలా 'పుష్ప'తో ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఈ సినిమా విషయంలో 'తగ్గేదే.. లే' అన్నట్లుగా చిత్రయూనిట్ అడుగులు వేస్తోంది. బబ్లీ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్‌గా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా రూపొందిస్తున్నట్లుగా ఇటీవల చిత్రయూనిట్ ప్రకటించింది.