గూగుల్ ఫొటో సేవల్లో అందుబాటులో ఉన్న ఉచిత అపరిమిత నిల్వ ఇవ్వాల్టి నుంచి ముగుయనున్నది

 


గూగుల్ ఫొటో సేవల్లో అందుబాటులో ఉన్న ఉచిత అపరిమిత నిల్వ ఇవ్వాల్టి నుంచి ముగుయనున్నది. ఫొటోలను దాచుకోవడం కోసం ఇప్పుడు వినియోగదారులు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. 100 జీబీ కోసం రూ.130 చెల్లించాల్సి ఉంటుంది. 200 జీబీ నుంచి 30 టీబీ వరకు ఎంత చెల్లించాలనేది గూగుల్ స్పష్టం చేసింది.


గూగుల్ ఫొటో షేరింగ్‌, స్టోరేజీ సేవలను 6 సంవత్సరాల క్రితం ప్రారంభించారు. అప్పటి నుంచి వినియోగదారులకు ఉచితంగా ఉన్నది. గూగుల్ ఫోటోలు క్లౌడ్ ఆధారిత సేవ. వినియోగదారు తన స్మార్ట్‌ఫోన్ ఫొటోలు, వీడియోలను గూగుల్ ఫొటోల్లో సేవ్ చేసినప్పుడల్లా అవి క్లౌడ్‌కు వెళ్తాయి. ప్రపంచంలోని ఏ మూలనైనా జీమెయిల్ ఐడీతో లాగిన్ అవ్వడం ద్వారా ఈ సేవలను పొందేలా రూపొందించారు. ఇప్పటివరకు అపరిమిత స్టోరేజీ ఇచ్చేవారు. అయితే, ప్రస్తుతం 15 జీబీ స్పేస్ మాత్రమే ఇస్తున్నారు. ఈ స్పేస్ నిండిన తర్వాత అప్‌లోడ్ నిలిచిపోతుంది. మరింత స్పేస్ కావాలంటే మాత్రం గూగుల్ సంస్థకు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.


గూగుల్ తెలిపిన వివరాల ప్రకారం నెలకు 100 జీబీకి రూ,130, ఏడాదికి రూ.1300, 200 జీబీ కావాలనుకుంటే నెలకు రూ.210, ఏడాదికి రూ.2100 చెల్లించాలి. 2టీబీకి నెలకు రూ.650, సంవత్సరానికి రూ.6500, 10 టీబీకి నెలకు రూ.3250, 20 టీబీకి నెలకు రూ.6500, 30 టీబీ కోసం నెలకు రూ.9750 కు చెల్లించాల్సి ఉంటుంది.