ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జీవితకాలం ముగిసిన వాహనాల రీసైక్లింగ్‌

 


ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జీవితకాలం ముగిసిన వాహనాల రీసైక్లింగ్‌ సదుపాయాలను ప్రారంభిస్తున్నట్టు రాంకీ ఎన్వీరో వెల్లడిం చింది. పర్యావరణ దినోత్సవ నేపథ్యంలో జనరేషన్‌ రిస్టోరేషన్‌కు అనుగుణంగా రీఇమాజిన్‌, రీక్రియేట్‌, రీస్టోర్‌ మంత్రాన్ని కంపెనీ అనుసరిస్తోందని పేర్కొంది. దేశవ్యాప్తం గా జీవితకాలం ముగిసిన వాహనాల రీసైక్లింగ్‌ సదుపాయా లతో కూడిన నెట్‌వర్క్‌ను ప్రారంభించనున్నట్టు రామ్కీ ఎన్వీరో ఇంజినీర్స్‌ లిమిటెడ్‌ (రీల్‌) వెల్లడించింది. ఈ సంవత్సర పర్యావరణ దినోత్సవ నేపథ్యమైన పర్యావరణ వ్యవస్థల పునరుద్ధరణ, పరిరక్షణకు అనుగుణంగా ఈ ప్రణాళికలను కంపెనీ వెల్లడించింది. వీటిలో భాగంగానే రామ్కీ ఎన్వీరో నూతన కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా జీవిత కాలం ముగిసిన వాహనాల రీసైక్లింగ్‌ కోసం ఏర్పాటు చేసే నెట్‌వర్క్‌, ప్రపంచ పర్యావరణ దినోత్సవ నేపథ్యమైన 'జనరేషన్‌-రీస్టోరేషన్‌' నేపథ్యానికి మద్దతునందిస్తుంది. 2025 నాటికి భారతదేశంలో దాదాపు రెండు కోట్ల వాహనాల జీవిత కాలం ముగియనుంది. వీటితో పాటుగా ఫిట్‌గా లేని వాహనాలను సరిగా రీసైకిల్‌ చేయకపోతే అవి గణనీయంగా కాలుష్యం వెదజల్లడంతో పాటుగా పర్యావర ణానికీ హాని కలిగిస్తాయి అని సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ (సీఎస్‌ఈ) నివేదిక వెల్లడిస్తుంది. అదే సమయంలో భారతీయ మొబిలిటీలో పర్యావరణ అంశా లతో పాటుగా జీవిత చక్రాన్ని పరిగణలోకి తీసుకోవడం ద్వారా స్థిరమైన రవాణా దిశగా ఇండియా పయనించే అవకాశాలున్నాయి.


ఇటీవలి కాలంలో వాహన స్క్రాపేజీ , ఈఎల్‌వీ నిర్వహణ విధానాలను తీసుకురావడం ఆ దిశగా వేసిన ఓ ముందడుగు. రీల్‌ దేశవ్యాప్త ఈఎల్‌వీ సదుపా యాలు ఆటోమేటెడ్‌ సాంకేతికతలతో విడదీయడం, డీపొ ల్యూటింగ్‌ చేయడంతో పాటుగా చిన్న చిన్న ముక్కలుగా చేస్తాయి. తొలి దశలో రీల్‌ ఈఎల్‌వీ రీసైక్లింగ్‌ సదుపా యాలను ఢిల్లీ ఎన్‌సీఆర్‌, ముంబై, బెంగళూరు, హైదరా బాద్‌, ఆదిత్యపూర్‌, చెన్నై నగరాల్లో అభివద్ధి చేయనున్నారు. రెండో దశలో ఈ నెట్‌వర్క్‌ను భారతదేశ వ్యాప్తంగా 25 నగరాలకు విస్తరించనున్నారు. ఈ కార్యక్ర మంలో భాగంగా పాసెంజర్‌, వాణిజ్య వాహన విభాగా లలోని ఆటోమోటివ్‌ కంపెనీలతో రీల్‌ భాగస్వామ్యం చేసుకోనుంది.