తెలంగాణ రాష్ట్రంలో కరోనా విపత్తు ప్యాకేజీ కింద నేటి నుంచి ఉచిత బియ్యం పంపిణీ

 


తెలంగాణ రాష్ట్రంలో కరోనా విపత్తు ప్యాకేజీ కింద నేటి నుంచి ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించనున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకం పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఇచ్చే ఉచిత బియ్యంతో పాటు తెలంగాణ కోటా కింద కూడా ఉచిత బియ్యం పంపిణీ చేయనుంది. తెలుపు రేషన్‌ కార్డు ఉన్న ఒక్కో వినియోగదారునికి 15 కిలోల చొప్పున పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎలాంటి పరిమితులు లేకుండా కార్డుపై ఎందరుంటే అందరికి 15 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తారు. సాధారణ రోజుల్లో ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున పంపిణీ చేస్తుండగా.. ఈనెలలో 15 కిలోల చొప్పున పంపిణీ చేస్తున్నారు. ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన కింద మే, జూన్‌ నెలల్లో ఒక్కొక్కరికి 5 కిలోలు ఉచిత బియ్యం పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. జూన్‌ కోటా