ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మహేశ్ కుమార్ జైన్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో రెండేళ్లు పొడిగించినట్టు ఆర్బీఐ వెల్లడిం

 


ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మహేశ్ కుమార్ జైన్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో రెండేళ్లు పొడిగించినట్టు ఆర్బీఐ వెల్లడించింది. ''ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా ఎంకే జైన్ పదవీ కాలాన్ని మరో రెండేళ్లు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 22 నుంచి ఆయన పునర్నియామకం అమల్లోకి వస్తుంది...'' అని ఆర్బీఐ ఇవాళ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా జైన్ ప్రస్తుత పదవీకాలం ఈ నెల 21తో ముగుస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా 2018 జూన్‌లో మూడేళ్ల పదవీ కాలానికి గానూ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా జైన్ నియమితులయ్యారు. ఆర్బీఐలో చేరేముందు ఆయన ఐడీబీఐ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. కాగా ఆర్బీఐలో ప్రస్తుతం మైఖేల్ పాత్రా, ఎం రాజేశ్వర్ రావు, టి రబి శంకర్ మిగతా ముగ్గురు సభ్యులుగా ఉన్నారు.