ఫ్యాన్స్‌ని అలరిస్తుంది. క్రాక్ వంటి మంచి హిట్ తర్వాత

 


సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ బర్త్‌డే సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేస్తున్నాయి. కరోనా వలన తన బర్త్‌డేని సింపుల్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు చెప్పిన బాలయ్య తన మూవీ అప్‌డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్‌ని ఆనందింపజేస్తున్నారు. బుధవారం రోజు అఖండ మూవీ నుండి పోస్టర్ విడుదల చేసిన మేకర్స్ కొద్దిసేపటి క్రితం గోపిచంద్ మలినేని సినిమాకు సంబంధించి అఫీషియల్ ప్రకటన చేశారు.


వేల త్వరలో మొదలు కానుందంటూ విడుదల చేసిన వీడియో ఫ్యాన్స్‌ని అలరిస్తుంది. క్రాక్ వంటి మంచి హిట్ తర్వాత గోపిచంద్ మలినేని.. బాలయ్యతో కలిసి పని చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలయ్యని పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్, ఫ్యాక్షనిస్ట్‌గా చూపించబోతున్నట్టు సమాచారం. అంతేకాదు ఈ సినిమాలో బాలయ్యను రెండు పాత్రలకు సంబంధించిన గెటప్స్‌కు కూడా రెడీ చేసినట్టు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ ఎత్తున తెరకెక్కించనుంది.