ప్రముఖ దర్శకుడు శోభన్ కుమారుడిగా సినిమా ఇండస్ట్రీకి పరిచయం

 


ప్రముఖ దర్శకుడు శోభన్ కుమారుడిగా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు సంతోష్ శోభన్. తనునేను సినిమాతో ఎంట్రీఇచ్చిన సంతోష్ ఆతర్వాత పేపర్ బాయ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సంతోష్ శోభన్ నటించిన ఏ మినీ కథ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బోల్డ్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఓటీటీ వేదికగా ఈ సినిమా విడుదలైంది. అయితే ఇప్పటికే ఈ యంగ్ హీరో భారీ బ్యానర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి రెడీగా ఉన్నాడు. ఇదే ఊపులో వరుస సినిమాలు చేసి టాలీవుడ్ లో నిలదొక్కుకోవాలని చూస్తున్నాడు. ఈ క్రమలోనే తన కొత్త సినిమాను అనౌన్స్ చేసాడు. సారంగ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ద్వారా అభిషేక్ మహర్షి అనే కొత్త కుర్రాడు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.


ఈ సినిమాకు ప్రేమ్ కుమార్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేసారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి టైటిల్ తో కూడిన ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పెళ్లి కొడుకు గెటప్ లో ఉన్న ఏనిమేటెడ్ ఫోటోను రిలీజ్ చేశారు. ఈ సినిమా కూడా పూర్తిగా వినోదభరితమైన కథాకథనాలతో ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సినిమా రాశి సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా 80 శాతం చిత్రీకరణను జరుపుకుందట.