12 నుండి18 ఏళ్లవారికి ‘కోర్బెవ్యాక్స్‌’ను టీకా

 హైదరాబాదీ కంపెనీ ‘బయొలాజికల్‌-ఈ’ అభివృద్ధిచేసిన కొవిడ్‌ టీకా ‘కోర్బెవ్యాక్స్‌’ను 12-18 ఏళ్లవారికి అత్యవసర ప్రాతిపదికన ఇచ్చేందుకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) అనుమతులు మంజూరు చేసింది. టీకాతో ప్రస్తుతం జరుగుతున్న రెండో/మూడోదశ ప్రయోగ పరీక్షల మధ్యంతర నివేదికల సమాచారం ఆధారంగా.. షరతులతో కూడిన వినియోగ అనుమతులు లభించాయని బయొలాజికల్‌-ఈ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మహిమ దాట్ల వెల్లడించారు. ప్రస్తుతం మనదేశంలోని పిల్లల్లో 15-18 ఏళ్ల వారికే వ్యాక్సినేషన్‌ జరుగుతోంది. 15 ఏళ్లలోపు వారికి టీకా ప్రారంభించే విషయంపై కేంద్రం నుంచి ఏ ప్రకటనా వెలువడలేదు.