1.29 కోట్ల మంది కస్టమర్లను కోల్పోయిన జియో. పెరుగుతున్న బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు..

 టెలికాం దిగ్గజం జియో ఎన్ని ప్రయత్నాలు చేసినా.. సంస్థకు కస్టమర్ల నుంచి ఎదురుదెబ్బ తగులుతూనే ఉంది. ప్రత్యర్థి ఎయిర్ టెల్ కు పోటీగా ఎన్ని ఆఫర్లు, సర్వీసులు తెచ్చినా మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. దీనికి సంబంధించి తాజా సమాచారం ప్రకారం 1.29 కోట్ల మంది వినియోగదారులు జియోను వీడారని గణాంకాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ మాత్రం 4 జీ సేవలు ప్రారంభించిన నాటి నుంచి తన కస్టమర్ల సంఖ్యను పెంచుకుంటూ పోతోంది. గడచిన డిసెంబర్ నెలకు సంబంధించి ఈ సమాచారాన్ని టెలికాం రెగ్యులేటరీ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. ఎక్కువ మంది చందాదారులను కోల్పోయిన కంపెనీల్లో జియో, వొడఫోన్ ఐడియా నిలిచాయి. వొడఫోన్ ఐడియా నుంచి 16 లక్షలకు పైగా చందాదారులు బయటకు వెళ్లిపోయారని ట్రాయ్ వెల్లడించిన గణాంకాలు చెబుతున్నాయి.


ధరలు పెంచి చందాదారులపై భారాన్ని పెంచాలనుకుంటున్నప్పటికీ దిగ్గజ టెలికాం భారతీ ఎయిర్ టెల్ మాత్రం తగ్గేదే అంటూ కొత్త కస్టమర్లను ఎట్రాక్ట్ చేస్తూ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం దేశంలో జియో వినియోగదారుల సంఖ్య 41.57 కోట్లగా ఉండగా.. బిఎస్ఎన్ఎల్ కొత్తగా 11 లక్షల మందిని తన నెట్ వర్క్ లోకి చేర్చుకుంది. మెుత్తానికి చాలా కాలం తరువాత బిఎస్ఎన్ఎల్ పైపు వినియోగదారులు తిరిగి మెుగ్గుచూపుతున్నారు.