సమంత కోసం 3 కోట్ల భారీ సెట్...?

 


నాగచైతన్యతో విడిపోయాక అందాల సమంతలో వచ్చిన మార్పులకు అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. క్రేజీ ప్రాజెక్ట్స్ ను లైన్‌లో పెట్టుకుంటూ.. తన కెరీర్ లో దూసుకుపోతోంది. తెలుగు, తమిళ భాషలతో పాటు హిందీలోనూ సమంత పలు ప్రాజెక్ట్స్‌కు కమిట్ అవుతోంది. అదే సమయంలో వెబ్ సిరీస్ లోనూ నటించడానికి ఆసక్తి చూపిస్తోంది. ప్రస్తుతం తెలుగులో గుణశేఖర్ దర్శకత్వంలో పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’ ను విడుదలకు సిద్దం చేసిన సామ్.. తమిళంలో విజయ్ సేతుపతి, నయనతారతో కలిసి నటించిన ‘కాత్తు వాక్కుల రెండు కాదల్’ చిత్రం కూడా విడుదవడానికి సిద్ధంగా ఉంది. అలాగే.. ఫ్యామిలీ మేన్ నిర్మాతలు సామ్ తో మరో వెబ్ సిరీస్ కు ప్లాన్ చేస్తున్నారు. ఇక తాజాగా సామ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘యశోద’. ఇదో క్రైమ్ థ్రిల్లర్. నూతన దర్శక ద్వయం హరి - హరీశ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని శ్రీదేవీ మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు.వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్నిముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ‘యశోద’ లో సమంత పాత్ర అందరినీ ఆశ్చర్యపరుస్తుందని చెబుతున్నారు. ఇంకా ఇందులో సామ్ యాక్షన్ సీక్వెన్స్ లో కూడా పాల్గొంటోందని సమాచారం. సమంత తన కెరీర్ లో ఇదివరకెన్నడూ చేయని ఓ పెక్యులర్ కేరక్టర్ ను చేస్తోందని తెలుస్తోంది. ఫ్యామిలీమేన్ 2 లో సామ్ పోషించిన రా అండ్ రస్టిక్ పాత్రకు బాగా పేరు రావడంతో.. ఆ ఇన్స్ పిరేషన్ తో యశోద లాంటి కథ రాసుకున్నారట ఇద్దరు దర్శకులు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న యశోద చిత్రం కోసం రూ. 3 కోట్ల ఖరీదులో భారీ సెట్ వేయనుండడం విశేషంగా మారింది. ఖరీదైన ఫైవ్ స్టార్ హోటల్ సెట్ ను ఆర్ట్ డైరెక్టర్ అశోక్ నిర్మిస్తున్నారు. 


సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ హోటల్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. ఇటీవల ‘పుష్ప’ చిత్రంలో ఊ అంటావా మావ.. ఉఊ అంటావా మావా అంటూ రెచ్చిపోయిన సామ్ .. ఆ పాటతో ఇండియా వైడ్ గా సూపర్ పాపులారిటీ తెచ్చుకుంది. ఈ క్రమంలో సమంతా నటిస్తున్న ‘శాకుంతలం, యశోద’ చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బిఫోర్ లాస్టియర్ ‘జాను’ అనే ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో మెప్పించిన సామ్.. ఇప్పుడు ఈ సినిమాలతో ఏ స్థాయిలో క్రేజ్ తెచ్చుకుంటుందో చూడాలి.