పీఎస్ఎల్వీ-సీ52 రాకెట్ రోదసీ యానాకి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. సోమవారం ఉదయం 5.59 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకుపోనుంది. సన్నాహాల్లో భాగంగా శనివారం మధ్యాహ్నం షార్‌లో జరిగిన మిషన్ రెడీనెస్ రివ్యూ (ఎంఆర్ఆర్) సమావేశంలో ఇస్రో నూతన చీఫ్ ఎస్ సోమనాధ్ పాల్గొన్నారు. సాయంత్రం లాంచ్ ఆథరైజేషన్ బోర్డు సమావేశమై ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఆదివారం తెల్లవారు జామున 4:29 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించింది. ఈ రాకెట్ 19 నిముషాల్లో 529 కి.మీ. ఎత్తుకు చేరి 17వేల 10 కిలోల దేశీయ భూ పరిశీలన ఉపగ్రహం ఈవోఎస్-04ను సూర్య సమస్థితి కక్ష్యలో వదిలిపెట్టనుంది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫేస్ అండ్ టెక్నాలజీ రూపొందించిన 8.1 కిలోల ఇన్‌స్పైర్‌శాట్-1, ఇస్రోకు చెందిన 17.5 కిలోల ఐఎస్ఎస్-2టీడీ ఉపగ్రహాలను ఈ రాకెట్ కక్ష్యలోకి విడిచిపెట్టనుంది.