ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న 8 మెడికల్‌ కాలేజీల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు.

 ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న 8 మెడికల్‌ కాలేజీల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. కొత్త వైద్య, విద్య కళాశాలలపై ఉన్నతాధికారులు, అయా జిల్లాల కలెక్టర్లు, కాలేజీల ప్రిన్సిపాళ్లతో మంత్రి బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పేదలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్యాన్ని చేరువ చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ జిల్లాకో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేేసందుకు చర్యలు తీసుకున్నారని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. అందులో భాగంగానే కొత్తగా 8 జిల్లాల్లో మెడికల్‌ కాలేజీలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. జాతీయ వైద్య మండలి నిబంధనల మేరకు నిర్మాణాలు ఉండాలని అధికారులకు సూచించారు.


మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్‌ కర్నూల్‌, మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాల్లో కాలేజీల నిర్మాణ పనుల పురోగతి గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు. భవన నిర్మాణ పనులు పూర్తయిన చోట మెడికల్‌ కాలేజీ నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. నిర్మాణ పనులలో వేగాన్ని పెంచేందుకు ప్రతి కాలేజీకి ఒక ఇంజనీరింగ్‌ అధికారిని ఏర్పాటు చేయాలని టీఎ్‌సఐఐసీ, ఆర్‌ అండ్‌ బీ అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, ఈఎన్సీ గణపతిరెడ్డి, సీఎం ఓఎస్డీ గంగాధర్‌, డీఎంఇ రమే్‌షరెడ్డి, టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ ఎండి చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్‌ అండ్‌ బి అధికారులు పాల్గొన్నారు.