మహేష్ బాబు, రాజమౌళి మల్టీస్టారర్..?

 దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు నటించే సినిమా కోసం ఎప్పటి నుంచో అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్ ను జక్కన్న కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే.. రైటర్ విజయేంద్ర ప్రసాద్ కూడా మహేశ్ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని రివీల్ చేశారు. ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం విడుదల కాగానే.. రాజమౌళి టీమ్.. మహేశ్ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభిస్తారు. మహేశ్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా, ఆయన ఇమేజ్ ను మ్యాచ్ చేసేలా విజయేంద్ర ప్రసాద్ పలు స్టోరీలైన్స్ రెడీ చేయగా.. జక్కన్న అందులోంచి ఒకటి ఎంపిక చేశారట. ఆఫ్రికన్ జంగిల్ అడ్వంచరస్ థ్రిల్లర్ గా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించబోతున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 


మహేశ్ - రాజమౌళి చిత్రంలో మరో స్టార్ హీరో కూడా నటించబోతున్నాట. అర గంట మాత్రమే అతడు స్ర్కీన్‌పై కనిపిస్తాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఆ స్టార్ హీరో ఎవరనేది సస్పెన్స్ గా మారింది. రాజమౌళి సినిమాల్లో నటించాలని ఎవరికి ఉండదు? అయితే ఆ అదృష్టవంతుడు ఎవరై ఉంటారు అని అభిమానుల్లో ఇప్పటి నుంచి ఆత్రుత మొదలైంది. ఆ స్టార్ హీరో చేసే పాత్ర బహుశా మహేశ్ తండ్రి పాత్ర అయి ఉంటుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.