తెలంగాణలో దళిత బాలికలకు రక్షణ లేదా?- తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణగౌడ్.

 


హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా,జహీరాబాద్ మండలం హుగ్గెల్లి గ్రామంలో దళిత మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ దుండగులను వెంటనే శిక్షించాలని ఆల్ ఇండియా దళిత్ సేన అధ్యక్షులు జేబీ రాజు గారు మండి పడుతూ తెలంగాణలో దళిత జాతిని చిన్న చూపు చూస్తున్నారని దళితులను సమాజంలో ఎదగనివ్వకుండా అణిచివేస్తున్నారని తెలియజేస్తూ దళిత మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తులను కఠినంగా శిక్షించాలని కేసును ఫాస్ట్ట్రాక్ కోర్టుకు అప్పచెప్పాలని మండి పడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తదనంతరం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణగౌడ్ మాట్లాడుతూ ఈ దేశంలో వెనుకబడిన కులాలను కొన్ని రాష్ర్టాల్లో ఎస్సీలుగా మరియు కొన్ని రాష్ర్టాల్లో బీసీలుగా దళిత జాతి వర్గాల వారీగా చిన్న చూపు చూస్తూ అణచివేయడానికి రాజకీయ కుట్రలు చేసి రాజకీయ అధికారం అనే మొండి వైఖరితో రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్నారని తెలియజేస్తూ జహీరాబాద్ మండలం హుగ్గెల్లి గ్రామంలో దళిత మైనర్ బాలిక పై అత్యాచారానికి పాల్పడ్డ దుండగులను వెంటనే శిక్షించి ఇలాంటి సంఘటనలు తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల ఎక్కడ కూడా జరగకుండా చూసే బాధ్యత తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగముదని మరియు ప్రభుత్వ అధికారులు ఇట్టి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని దుండగులను కఠినంగా శిక్షించాలని తెలియజేశారు. అదేవిధంగా రానున్న రోజుల్లో బహుజనులు, ఎస్సీ.ఎస్టీ.బీసీ.మైనార్టీ లు కోరుకునే పాలన వస్తుందని మా దళిత బహుజన ప్రజలను చిన్నచూపు చూసే రాజకీయ నాయకులకు త్వరలో తగిన బుద్ది చెప్పడం ఖాయమని ఖరారు చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో తెలంగాణ మాల మహానాడు అధ్యక్షులు గోపోజు రమేష్ బాబు మరియు దళిత సంఘ ప్రముఖ నాయకులు పాల్గొన్నారు.