బోయపాటి తో రామ్ సినిమా ఫిక్స్...

 'అఖండ’ సూపర్‌ హిట్‌ తర్వాత దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించే చిత్రం ఫైనలైజ్‌ అయింది. రామ్‌ పోతినేని ఈ చిత్రంలో హీరోగా నటించనున్నారు. ప్రస్తుతం రామ్‌తో ‘ది వారియర్‌’ చిత్రాన్ని నిర్మిస్తున్న శ్రీనివాసా చిట్టూరి పాన్‌ ఇండియా లెవల్‌లో ఈ సినిమాను నిర్మించనున్నారు.


శుక్రవారం ఈ చిత్ర వివరాలు వెల్లడిస్తూ ‘బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది. రామ్‌తో తీస్తున్న ‘ది వారియర్‌’ చిత్రం తర్వాత సినిమాగా ఇది కుదరడం చాలా హ్యాపీగా ఉంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేస్తాం. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాం’ అని చెప్పారు శ్రీనివాసా చిట్టూరి. ఈ చిత్రానికి పవన్‌కుమార్‌ సమర్పకులు.