దేశంలో సెమీకండక్టర్ల తయారీ ప్రోత్సహించేందుకు కేంద్ర కొత్త పథకం.

 దేశంలో సెమీకండక్టర్ల కొరత తీవ్రంగా ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వం చిప్​ తయారీ సంస్థలను ప్రోత్సహించాలని ఓ పథకం తీసుకొచ్చింది. దీంతో దేశంలో పలు కంపెనీలు చిప్ తయారీ పరిశ్రమ నెలకొల్పేందుకు ముందుకు వస్తున్నాయి. సుమారు రూ.1,53,750 కోట్ల (2,050 కోట్ల డాలర్లు) పెట్టుబడితో ఈ ప్లాంట్లను నెలకొల్పేందుకు ఐదు కంపెనీలు ముందుకు వచ్చినట్లు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. వేదాంత ఫాక్స్‌కాన్‌ భాగస్వామ్య సంస్థ, ఐజీఎస్ఎస్‌ వెంచర్స్‌, ఐఎస్ఎంసీ 130.6 కోట్ల డాలర్ల (రూ.1.02 లక్షల కోట్లు) పెట్టుబడితో ఎలకాట్రనిక్‌ చిప్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించాయని తెలిపింది.


అంతేకాకుండా రూ.76,000 కోట్లతో కూడిన సెమీకాన్‌ ఇండియా కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు రూ.42,000 కోట్ల మేర పెట్టుబడుల మద్దతును ఈ కంపెనీలు కోరుతున్నాయని పేర్కొంది. దాదాపు రూ.42,000 కోట్ల మేర పెట్టుబడుల మద్దతును ఈ కంపెనీలు కోరుతున్నాయని పేర్కొంది. ప్రతి నెల 1.2 లక్షల వేఫర్స్‌ తయారీ సామర్థ్యంతో 28 నుంచి 65 నానోమీటర్‌ సెమీకండక్టర్‌ ఫ్యాబ్స్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సంబంధించి ఈ ప్రతిపాదనలను కంపెనీలు సమర్పించాయని ప్రభుత్వం వెల్లడించింది. 28 నుంచి 45 నానోమీటర్‌ సామర్థ్యంతో కూడిన చిప్స్‌ కోసం ప్రభుత్వం 40 శాతం వరకు ఆర్థికపరమైన మద్దతునందిస్తోంది.