కొవిడ్ మహమ్మారిపై సమర్థవంతంగా పోరాడేందుకు అందుబాటులోకి మరో వ్యాక్సీన్

 



కొవిడ్ మహమ్మారిపై సమర్థవంతంగా పోరాడేందుకు మరో వ్యాక్సీన్ అందుబాటులోకి వచ్చింది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా కొత్త వ్యాక్సీన్‌కు సోమవారం అనుమతి ఇచ్చింది. ఈ వ్యాక్సిన్ 12 నుంచి 18 ఏళ్ల వయసు మధ్య వారి కోసమని ఆ వ్యాక్సీన్ రూపకర్త తెలిపారు. ‘బయోలాజికల్ ఈ’ అనే సంస్థ రూపొందించిన ఈ వ్యాక్సీన్‌కు కార్బివ్యాక్స్ అని నామకరణం చేశారు. ఈ విషయమై బయోలాజికల్ ఈ లిమిటెడ్ స్పందిస్తూ ‘‘బయోలాజికల్ ఈ లిమిటెడ్ రూపొందించిన కార్బివ్యాక్స్ వ్యాక్సిన్, దేశీయంగా రూపొందించిన మొట్టమొదటి రిసెప్టర్ బైండింగ్ డొమైన్ (ఆర్‌డీబీ) ప్రొటీన్ సబ్-యూనిట్ వ్యాక్సీన్. 12 నుండి 18 సంవత్సరాల వయస్సు గల వారికి అత్యవసర వినియోగానికి భారతదేశం యొక్క డ్రగ్ రెగ్యులేటర్ నుండి అనుమతి పొందింది’’ అని పేర్కొన్నారు.