హ్యూమన్ రైట్స్ కమిషన్ ను ఆశ్రయించిన- తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణగౌడ్.

   
హైద్రాబాద్: తెలంగాణ రాష్ట్రంలో  తెలంగాణ సాధన మేరకై తెలంగాణ ప్రజలు కలలు గన్న  ఆకాంక్షను నెరవేర్చుకోకపోవడం దురదృష్టకరమని మండి పడుతూ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణగౌడ్ మాట్లాడుతూ ప్రజలు  న్యాయ పూరితమైన సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన  అట్టి సమస్యలపైనా  నిర్లక్ష్యం వహిస్తూ  సంబంధిత ప్రభుత్వ అధికారులు ప్రజలను తప్పుదారి పట్టించడం  సమంజసం కాదని తెలియజేస్తూ అట్టి సమస్యలను  ప్రజాస్వామ్యంలో  ఓటు అనే ఆయుధంతో  ఎన్నుకున్నటువంటి  అధికారిక రాజకీయ నాయకులు  సమస్యలపై దృష్టి పెట్టి  న్యాయబద్ధమైన సమస్యలను  ప్రభుత్వ అధికారులు   పరిష్కరించాలని తెలియజేసినా కూడా   అట్టి విషయాలపై  ఎటువంటి  అవగాహన లేని విధంగా వ్యవహరిస్తూ  సమస్యలను పరిష్కరించక పోవడం  చాలా బాధాకరమని  ఈ ప్రజాస్వామ్యంలో  ప్రజలు కోరిన పాలన నడుస్తుందా  అని మండిపడ్డారు అదేవిధంగా ఇట్టి   సమస్యలపై తెలంగాణ రాష్ట్ర  మానవ హక్కుల కమిషన్ను ప్రజాస్వామ్యంలో  ఉన్నట్టు వంటి ప్రజల హక్కుల సాధనకై   ప్రజా పూరితమైన  న్యాయబద్ధమైన  అధికారికమైన  చట్టాలను  దృష్టిలో ఉంచుకొని  అర్హులైన  ప్రజలకు  వెంటనే న్యాయం చేకూర్చాలని తెలియజేశారు. మరియు  సమాచార చట్టం హక్కుపై ప్రజలు కోరిన  సమాచారాన్ని సంబంధిత అధికారులు  నిర్లక్ష్యం వహించకుండా  తప్పుదోవ పట్టించకుండా ప్రజలకు  సరైన సమాచారాన్ని  ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.ఈ యొక్క కార్యక్రమంలో  సమస్యల సాధనకై  బి. కృష్ణ గారు,   బి.పర్శరాములు మరియు సమస్యల పరిష్కారం కోసం వచ్చిన  ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.