పోలవరం ప్రాజెక్ట్‌పై కేంద్రం కీలక సమావేశం...

 పోలవరం ప్రాజెక్ట్‌పై కేంద్రం కీలక సమావేశం నిర్వహించింది. మంగళవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏపీ అధికారులతో సీడబ్ల్యుసీ, ప్రాజెక్ట్ అప్రయిసల్ కమిటీ, జలశక్తి అధికారులు భేటీ అయ్యారు. ఏపీ నీటిపారుదల శాఖ కార్యదర్శి జవహర్ రెడ్డి, ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి, చీఫ్ ఇంజనీర్ సుధాకర్ బాబు,పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం, పనుల పురోగతి, నిధులు, పోలవరం పునరావాసం, నష్టపరిహారం సహా ప్రాజెక్ట్ ఇతర అంశాలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.