జాతీయ బీసీల రాష్ట్ర మహాసభల్లో పాల్గొన్న తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణగౌడ్.

 హైద్రాబాద్ : జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాచిగూడ అభినందన గ్రాండ్ హోటల్లో నిర్వహించబడిన జాతీయ బీసీల రాష్ట్ర మహాసభ వేడుకల్లో బీసీ ఉద్యమానికి వెన్నంటి ఉండి రథసారథిగా బీసీ ఉద్యమాన్ని విజయ పథంలో తీసుకెళ్తున్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో బీసీలు అలుపెరుగని పోరాటం చేయాలి , బీసీల జనాభా వాటా ప్రకారం మనకు కావాల్సిన హక్కులను మనమే పోరాడి సాధించుకోవాలి అని తెలియజేస్తూ మహా సభలో పాల్గొన్న అన్ని ప్రాంతాల నుండి వచ్చిన రాష్ట్ర నాయకులను, జిల్లా నాయకులను,నియోజకవర్గాల నాయకులను,మండల నాయకులను చైతన్య పరుస్తూ బీసీ ఉద్యమం బీసీల కోసం చరిత్రలో నిలిచే విధంగా ఉండాలని తెలియజేశారు. తదనంతరం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది కోవూరి మాట్లాడుతూ బీసీ సమాజానికి సేవ చేయాలనే దృక్పథంతో నడుము బిగించే ప్రతి నాయకుడు ఆర్ కృష్ణయ్య గారి ఉద్యమ స్ఫూర్తి దాయకమైన నాయకత్వాన్ని ఆదర్శంగా తీసుకొని అలుపెరుగని పోరాటం చేస్తూ బీసీలను బానిసత్వం నుండి దూరం చేసి స్వేచ్ఛ స్వాతంత్య్రం గల స్వరాజ్యంలో బీసీలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి దశలో ఎదగాలని అదేవిధంగా ఎవరైనా అధికారికంగా ఉన్న నాయకులు రాజకీయ మొండి వైఖరితో బీసీలను చిన్నచూపు చూస్తూ బీసీల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించిన అట్టి నాయకుల రాజకీయ అధికార గద్దెను దింపడానికి సరైన సమయం ఆసన్నమైందని తెలియజేశారు. అందుకు బీసీలు రాష్ట్రాల వ్యాప్తంగా ఐక్యమత్యంతో చైతన్యవంతులై ముందుకు సాగాలని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ గారు, జాతీయ బిసి వర్కింగ్ ప్రెసిడెంట్ సురేష్ దాసుగారు, ఉపాధ్యక్షులు గుజ్జ సత్యంగారు , లాల్ కృష్ణ గారు, సంగారెడ్డి జిల్లా బీసీ నాయకులు గొల్లగూడెం శంకర్ గౌడ్ గారు మరియు వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన జిల్లా బీసీ నాయకులు, మండల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.