‘రాధేశ్యామ్‌’ సినిమా కు బాలీవుడ్‌ బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ వాయిస్‌ ఓవర్‌ ...

 పాన్‌ ఇండియా కథానాయకుడు ప్రభాస్‌ నటించిన తాజా చిత్రం ‘రాధేశ్యామ్‌’. పూజాహెగ్డే అందం, పాతకాలం నాటి భారీ సెట్‌లు ప్రేక్షకుల మనసులు చూరగొన్నాయి. తాజాగా ఈ సినిమాకు మరో ప్రత్యేకాకర్షణ జత అయింది. బాలీవుడ్‌ బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ ‘రాధేశ్యామ్‌’కు వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. మంత్రముగ్ధులను చేసే స్వరంతో ఈ ప్రేమకథను ఆయన తన గొంతుతో ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు రాధాకృష్ణకుమార్‌ మంగళవారం సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. ‘చరిత్రాత్మక ప్రేమకథ మీ వ్యాఖ్యానంతో చిరస్థాయిగా నిలిచిపోతుంది’ అని అమితాబ్‌ బచ్చన్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. భూషణ్‌ కుమార్‌, వంశీ, ప్రమోద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 11న ఈ చిత్రం విడుదలకానుంది