వచ్చేస్తున్నా భీమ్లా నాయక్..

 భీమ్ భీమ్ భీమ్ భీమ్లా నాయక్..లోడింగ్ అంటూ చిత్రబృందం తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబా హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా గురించి అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచుస్తున్నారు. పక్కా మాస్ ఎంటర్టైనర్ మూవీగా దీనిని దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీలోని పవన్ సోలో సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్టిల్‌ను చిత్రబృందం ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. 


అంతేకాదు, ప్రస్తుతం 'భీమ్లా నాయక్' షూటింగ్ జరుగుతుందని.. త్వరలోనే విడుదల తేదీని అనౌన్స్ చేస్తున్నాం.. వెయిట్ చెయ్యాలి అని కన్ఫర్మ్ చేశారు. ఇక సాంగ్ లిరిక్ "ఆ జుట్టునట్టా సవరించినాడో… సింగాలు జూలు విదిలించినట్టే"ను జత చేశారు. 'భీమ్లా నాయక్' వచ్చేది ఫిబ్రవరి 25వ తేదీనా లేక ఏప్రిల్ 1వ తేదీనా.. అని కన్‌ఫ్యూజన్‌లో ఉన్న అందరికీ మేకర్స్ త్వరలో క్లారిటీ ఇవ్వబోతున్నారు.