ప్రభాస్ సరసన హీరోయిన్‌గా మాస్టర్ బ్యూటీ..

 ప్రభాస్ సరసన మాళవిక మోహన్ హీరోయిన్‌గా నటించే అవకాశం అందుకుందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న డార్లింగ్..దర్శకుడు మారుతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఇటీవల వార్తలు వస్తున్నాయి. 'రాజా డీలక్స్' అనే టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనున్నట్టు ప్రచారం జరుగుతోంది. యూవీ క్రియేషన్స్ నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ దాదాపు పూర్తి కావచ్చిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నటీ నటులతో పాటు ఇతర టెక్నికల్ టీమ్ ఎంపిక జరుగుతుందట. ఇందులో భాగంగా ప్రభాస్ సరసన నటించే హీరోయిన్ కోసం తమిళంలో 'మాస్టర్' సినిమాతో హిట్ అందుకొని క్రేజ్ తెచ్చుకున్న మాళవిక మోహన్‌ను ఎంపిక చేసినట్టు సమాచారం. ప్రభాస్ కటౌట్‌కు ఆమె పర్‌ఫెక్ట్ అని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. ఇదే నిజమైతే డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతారు. మరి దీనికి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందో చూడాలి. కాగా 'రాధే శ్యామ్ సినిమాతో వచ్చే నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ప్రభాస్..ఇప్పుడు ప్రాజెక్ట్ కె షూటింగ్‌లో బిజీగా ఉన్నట్టు సమాచారం.