తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల..
 తెలంగాణ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ పదో తరగతి పరీక్ష  షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ ఏడాది పరీక్షలు మే 11,2022న పరీక్షలు ప్రారంభంకానున్నాయి. చివరి పరీక్ష మే 20, 2022తో ముగియనుంది. గత రెండు అకడమిక్‌ ఇయర్స్‌లో కరోనా కారణంగా పరీక్షలు లేకుండానే విద్యార్థులను ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా పరిస్థితులు అనుకూలించడంతో పరీక్షలను నిర్వహించడానికి బోర్డ్‌ మొగ్గు చూపింది. ఇక కరోనా థార్డ్‌ వేవ్‌ కూడా తగ్గుముఖం పట్టడం, స్కూళ్లు తిరిగి ఓపెన్‌ కావడంతో ఈసారి పరీక్షలను నిర్వహించనున్నారు.

పదో తరగతి పరీక్షల పూర్తి షెడ్యూల్‌..

* 11-05-2022 ఫస్ట్‌ లాంగ్వేజ్‌ ఉదయం 9:30 గంటల నుంచి 12:45 గంటల వరకు.

* 12-05-2022 సెకండ్‌ లాంగ్వేజ్‌ ఉదయం 9:30 గంటల నుంచి 12:45 గంటల వరకు.

* 13-05-2022 థార్డ్‌ లాంగ్వేజ్‌ (ఇంగ్లిష్‌) ఉదయం 9:30 గంటల నుంచి 12:45 గంటల వరకు.

* 14-05-2022 మ్యాథమెటిక్స్‌ ఉదయం 9:30 గంటల నుంచి 12:45 గంటల వరకు.

* 16-05-2022 జనరల్‌ సైన్స్‌ పేపర్ (ఫిజికల్‌, బయోలాజికల్‌ సైన్స్‌) ఉదయం 9:30 గంటల నుంచి 12:45 గంటల వరకు.

* 17-05-2022 సోషల్‌ స్టడీస్‌ ఉదయం 9:30 గంటల నుంచి 12:45 గంటల వరకు.

* 18-02-2022 ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ – 1, (సంస్కృతం, అరబిక్‌) ఉదయం 9:30 గంటల నుంచి 12:45 గంటల వరకు.

* 19-05-2022 ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ – 2 (సంస్కృతం, అరబిక్‌) ఉదయం 9:30 గంటల నుంచి 12:45 గంటల వరకు.

* 20-05-2022 ఎస్‌ఎస్‌సీ వొకేషనల్ కోర్స్‌ (థియరీ) ఉదయం 9:30 గంటల నుంచి 11:30 వరకు.