ట్రాఫిక్ పెండింగ్ చలనాలు వాహనదారులకు ఉన్న వాహనదారులకు శుభవార్త..! త్వరలో పెండింగ్ చలానాలపై రాయితీ ప్రకటించేందుకు హైదరాబాద్ పోలీసులు సిద్ధమయ్యారు. ఈ మేరకు శుక్రవారం ట్రాఫిక్ ఉన్నతాధికారుల సమీక్షలో హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఈ మేరకు సూచనలు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ. 600 కోట్ల మేర పెండింగ్ చలానాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో సింహభాగం వాటా హైదరాబాద్‌దే. పెండింగ్ చలానాలను క్లియర్ చేయించేందుకు రాయితీలను ప్రకటిస్తే.. వాహనదారులు ముందుకు వస్తారని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అయితే.. ఎంత మొత్తంలో రాయితీ ఇవ్వాలి? అనేదానిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు.