పీఆర్సీ జీవోలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఉద్యోగులతో కుదిరిన ఒప్పందం ప్రకారం హెచ్ఆర్ఏ, సీసీఏ, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ జీవోలు విడుదల చేసింది. ఏపీ భవన్, హైదరాబాద్లో ఉండే ఏపీ ఉద్యోగులకు 24 శాతం హెచ్ఆర్ఏ, అలాగే జిల్లా కేంద్రాల్లో 16శాతం, మిగతా ప్రాంతాలవారికి 12 శాతం, ఇతర ప్రాంతాల వారికి 10 శాతం బేసిక్ పే వర్తింపచేస్తూ ఈ మేరకు జీవో జారీ చేసింది.