ఏపీ సర్కార్ పై హైకోర్టు ఫైర్..

 ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళా రక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా నియమించడంపై మండిపడింది. ఇది రాజ్యంగంలోని ఆర్టికల్‌ 309 కి విరుద్దమని వ్యాఖ్యానించింది. పోలీసు యాక్టుకు కూడా విరుద్దమని ధర్మాసనం స్పష్టం చేసింది. బుధవారం మహిళా రక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా నియమించడంపై హైకోర్టులో విచారణ జరిగింది. పిటీషనర్ల తరపున నర్రా శ్రీనివాస్‌, యలమంజుల బాలాజీ వాదనలు వినిపించారు. బ్యాక్‌ డోర్‌ ఎంట్రీ చట్ట విరుద్దమని వ్యాఖ్యానించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు సిద్ధమైంది. రాజ్యంగ విరుద్ధమనేందుకు ప్రాధమిక ఆధారాలు ఉన్నాయని న్యాయస్థానం తెలిపింది. అడిషనల్‌ కౌంటర్‌‌ను పరిశీలించాలని ధర్మాసనానికి ప్రభుత్వ న్యాయవాది విజ్ఞప్తి చేశారు. అన్ని పిటీషన్లను రేపే విచారిస్తామని తెలుపుతూ తదుపరి విచారణను హైకోర్టు రేపటి(గురువారం)కి వాయిదా వేసింది.