మేడారం జాతరకు భక్తుల రద్దీ...

 



మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో మేడారానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. సమ్మక్క సారక్క గద్దెలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మేడారం జాతరలో వన దేవతలకు భక్తులు నిలువెత్తు బంగారం (బెల్లం) ఇచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. సమ్మక్క సారక్కలను దర్శించుకుని జంపన్న వాగులో స్నానమాచరించి భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. మేడారం పరిసర ప్రాంతాల నుంచి సమ్మక్క సారక్కను దర్శించుకుకోవడానికి భారీగా తరలివస్తున్నారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.