‘భీమ్లానాయక్’ ఓటీటీ రైట్స్ ను భారీ ధరతో కొనుగోలు చేసిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్..?

 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న యాక్షన్ థ్రిల్లర్ ‘భీమ్లానాయక్’. సితారా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మాణం జరుపుకుంటోన్న ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రానికి అఫీషియల్ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా స్ర్కిప్ట్ లో స్వల్ప మార్పు చేశారు. చిత్రానికి త్రివిక్రమ్ స్ర్కీన్ ప్లే సంభాషణలు అందించడం విశేషం. ఇదివరకు విడుదలైన టీజర్స్, సింగిల్స్ కు మంచి రెస్పాన్స్ రావడంతో చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫిబ్రవరి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా నెలకొల్పే రికార్డుల కోసం అభిమానులు ఇప్పటినుంచే లెక్కలు కడుతున్నారు. 


ఇక ‘భీమ్లానాయక్’ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఆసక్తి రేపుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు భారీ ధరతో కొనుగోలు చేశారట. సినిమా థియేటర్స్‌లో విడుదలైన 45రోజుల తర్వాత చిత్రం స్ట్రీమ్ అయ్యేలా అగ్రిమెంట్ కుదుర్చుకున్నారని టాక్. నిత్యామీనన్, సంయుక్త మీనన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాలో సముద్రఖని, మురళీ శర్మ, బ్రహ్మాజీ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.