సెన్సార్ పూర్తి చేసుకున్న భీమ్లానాయక్ సినిమా..

 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా నటిస్తున్న భీమ్లానాయక్ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. మలయాళం లో సూపర్ హిట్ అయిన అయ్యపనుమ్ కోషియం సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో పవన్ కు జోడీగా టాలెంటెడ్ హీరోయిన్ నిత్యామీనన్ నటిస్తుండగా.. రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది ఈ సినిమా. ఫిబ్రవరి 25న తెలుగు, హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది భీమ్ల నాయక్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, పాటలు, గ్లిమ్ప్స్ ఈ సినిమా అంచనాలను భారీగా పెంచేశాయి.


తాజాగా భీమ్లానాయక్ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ మూవీకి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చింది. ఈమేరకు ఓ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. పవన్ కళ్యాణ్ బైక్ పై వస్తున్న స్టిల్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో అభిమానులలో మరింత క్యూరియాసిటీ పెరిగిపోతుంది. ఇక ఈ మూవీ విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో భీమ్లా నాయక్ గురించి ప్రతి చిన్న అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ట్రైలర్‏ను రేపు (ఫిబ్రవరి 19న) రిలీజ్ చేయాలని భావిస్తున్నారట మేకర్స్. అంతేకాదు.. ఫిబ్రవరి 21న భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని సన్నాహాలు చేస్తున్నారట.