చేనేత కుటుంబాల జీవితాలతో చెలగాటమాడుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం-తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణగౌడ్.

 హైద్రాబాద్ : సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ముక్కుమ్మడి నేతన్నల ఆత్మహత్యలకు సంఘీభావం తెలుపుతూ జాతీయ నేతన్నల ఐక్య కార్య చరణ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణగౌడ్ మాట్లాడుతూ చొప్పదండి నగరంలో కాట్నపల్లి గ్రామంలో భైరి శంకరయ్య చేనేత కుటుంబానికి జరిగిన దారుణం అనగా చేనేత కుటుంబం ముక్కుమ్మడిగా ఆత్మహత్య చేసుకోవడం తెలంగాణ సమాజానికి చాలా బాధాకరమైన విషయం మరియు తెలంగాణ రాష్ట్రంలో అధిక జనాభా ఉన్న పద్మశాలీలకు సరైన న్యాయం జరగకపోవడం చాలా బాధాకరమని తెలియజేస్తూ భైరీ శంకరయ్య కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 కోట్ల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఇలాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క బీసీ బిడ్డకు జరిగిన ఊరుకోమని ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలకు కారణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యమని తెలుపుతూ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల బాధక సాధకులను అర్థం చేసుకోకుండా మొండివైఖరితో వ్యవహరిస్తున్న అధికార రాజకీయ నాయకులకు తగిన బుద్ది కచ్చితంగా చెప్తామని పేదరికంతో అలమటిస్తున్న పేద ప్రజలు కచ్చితంగా రానున్న రోజుల్లో రాజకీయ అధికారంతో మొండివైఖరితో కొనసాగుతున్న నాయకులకు అధికార గద్దె దింపడం ఖాయమని ఖరారు చేశారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ,బీసీ మైనార్టీ ప్రజల ఓట్లు ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉండి నిరంతర పోరాటం చేసే ప్రజాపోరాట నాయకుల్ని అధికారంలోకి తీసుకొస్తామని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేశ్ గారు, బహుజన సంఘాలు, చేనేత సంఘం నాయకులు మరియు బీసీ సంఘం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.