ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో మాస్ యాక్షన్ గా చిరు,వెంకీ కుడుముల సినిమా..?
 మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో తొలి ఫ్యాక్షన్ చిత్రం ‘ఇంద్ర’. బ్లాక్ బస్టర్ హిట్టైన ఈ సినిమా వచ్చి ఇప్పటికి 20 ఏళ్ళు అవుతోంది. ఆ తర్వాత మరోసారి చిరు సీమకథల వైపే చూడలేదు. మళ్ళీ ఇన్నాళ్ళకు మెగాస్టార్ మరో సీమకథలో నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మెగాస్టార్ వరుస సినిమాల్ని లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ఆచార్య తర్వాత ‘గాడ్ ఫాదర్, భోళాశంకర్’ , బాబీ దర్శకత్వంలోని చిత్రాలతో పాటు వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్అవుతున్న సంగతి తెలిసిందే. ‘ఛలో, భీష్మ’ చిత్రాలతో వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్న వెంకీ.. మెగాస్టార్ తో ఓ అదిరిపోయే సీమ కథాంశంతో సినిమా తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. వెంకీ తరహా కామెడీ ఎంటర్‌టైనర్ గా సినిమా ఉంటుందట.  


కథ ఇంప్రెసివ్ గా ఉండడంతో వెంకీ కుడుముల దర్శకత్వంలోని సినిమాకి చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘ఆర్.ఆర్.ఆర్’ లాంటి భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న డీవివి దానయ్య నిర్మాణంలో ఈ రూపొందనున్నట్టు అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. ఇక ఇందులో చిరంజీవి పాత్ర రాయలసీమ యాసతో హిలేరియస్ కామెడీని పండించబోతున్నట్టు తెలుస్తోంది. ఇందులో చిరంజీవి ఇన్ స్టా గ్రామ్ ఇన్ఫ్లూయెన్సర్ గా నటిస్తున్నారట. పూర్తి స్థాయిలో కామెడీ పంచులతో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్సెస్ తో సినిమా ఉండబోతోందని సమాచారం. రెగ్యులర్ సీమ నేపథ్యంలోని ఫ్యాక్షన్ చిత్రంలా కాకుండా.. ‘ఛలో’ తరహాలోని ఆసక్తికరమైన కథాకథనాలతో బ్యాక్ టు బ్యాక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనుందట. 


ఇక ఇందులో కథానాయికగా శ్రుతి హాసన్ పేరు వినిపించింది. ఇప్పుడు మాళవికా మోహనన్ నటించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం వెంకీ కుడుముల ఈ సినిమా స్ర్కిప్ట్ వర్క్ లో బీజీగా ఉన్నాడట. త్వరలోనే సినిమా గ్రాండ్ గా లాంఛయి.. ఆపై రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. కామెడీ పండించడంలో మాస్టర్ అయిన చిరు, కామెడీ సినిమాలు తీయడంలో తన మార్కు చూపించిన వెంకీ కుడుముల కలిస్తే.. ఆ సినిమా ఏ స్థాయిలో ఉంటుందో ఊహించొచ్చు. ఈ మధ్యకాలంలో చిరంజీవి నుంచి ఫుల్ లెంత్ కామెడీ మిస్ అయిన అభిమానుకలకు ఈ సినిమా ఫుల్ మీల్సే అని చెప్పనవసరం లేదు. వచ్చే ఏడాది సినిమా విడుదల కాబోతోంది. మరి ఈ సినిమాకి ఏ తరహా టైటిల్ ఫిక్స్ చేస్తారో చూడాలి.