ప్రధాని మోదీ చెప్పేది ఒకటి.. చేసేది మరొకటని అన్నా సీఎం కేసీఆర్..

 ప్రధాని మోదీపై సీఎం కేసీఆర్ మరోసారి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ చెప్పేది ఒకటి.. చేసేది మరొకటని చెప్పారు. ప్రధాని మోదీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అగ్రికల్చర్ సెక్టార్‌లో మీటర్లు పెట్టాలని రాష్ట్రాలకు కేంద్రం ముసాయిదా ఇచ్చిందని తెలిపారు. దానికి తాను కూడా సమాధానం పంపానని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం కేంద్ర ఉత్తర్వులు పాటిస్తోందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే 25 వేల మీటర్లు పెట్టారని తెలిపారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి బీజేపీ వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ఆయనకు చదువు వచ్చో రాదో తెలియడం లేదని కేసీఆర్‌ ఎద్దేవాచేశారు.