ఢిల్లీకి వెళ్లనున్న సీఎం కేసీఆర్..

 ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ వారంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు ఢిల్లీలో ముఖ్యమంత్రి వివిధ పార్టీల ముఖ్యనేతలను కలిసే అవకాశం వుందని పార్టీ వర్గాల సమాచారం. ఢిల్లీలో ముఖ్యమంత్రి ఎవరెవరరని కలుస్తారు అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారాలని ఇప్పటికే భావిస్తున్న కేసీఆర్ ఢిల్లీ వేదికగా ప్రాంతీయ పార్టీల నేతలతో సమావేశం కానున్నారు. రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లతో సమావేశం అవుతానని, వివిధ అంశాలపై వారితో చర్చిస్తానని కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.


ఢిల్లీ వేదికగా కొంతమంది ఆఫీసర్లతో కూడా కేసీఆర్ సమావేశం అయ్యే అవకాశం ఉంది.రాష్ట్రాలలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి... కేంద్రంలో పాలించిన కాంగ్రెస్, బిజెపిలు రాష్ట్రాల హక్కులు హరించడం పై సమావేశం కూడా పలువురునేతలు, అధికారులతో కానున్నారు.అదేవిధంగా డిల్లీ ముఖ్యమంత్రి తో పాటు పలువురు ప్రాంతీయ పార్టీల నేతలతో కలిసే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది.