ప్రభాస్ హీరోగా నటించిన ప్యాన్ ఇండియా చిత్రం ‘రాధేశ్యామ్’. రాధా కృష్ణకుమార్ దర్శకత్వంలో గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంస్థలు నిర్మిస్తున్నాయి. మార్చి 11న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలకు రెస్పాన్స్ అదిరిందని మేకర్స్ చెబుతున్నారు. వాలంటైన్స్ డే సందర్భంగా స్పెషల్ గ్లింప్స్ విడుదల చేశారు. దానికి కూడా మంచి రెస్పాన్ వచ్చిందని, పోస్టర్లో ప్రభాస్, పూజాహెగ్డేల మధ్య రొమాన్స్ చాలా బాగుందని చెబుతున్నారు. జస్టిన్ ప్రభాకరన్, అర్జిత్ సింగ్, మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్, జబిన్ నౌతీయల్, మనోజ్ ముంటాషిర్, కుమార్, రష్మీ విరాగ్ బృందం అంతా కలిసి సౌత్, నార్త్ వర్షన్స్‌కు ‘రాధేశ్యామ్’ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.