క్రేజ్ తో పెరిగిన 'భీమ్లా నాయక్' సినిమా బిజినెస్ రేంజ్..?

 'భీమ్లా నాయక్' చిత్రానికి భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తాజాగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా ఇది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించారు. ఈ నెల 25వ తేదీన రిలీజ్ చేసేందుకు మేకర్స్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రూ. 100 కోట్లకు పైగా మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు సమాచారం. మలయాళంలో సూపర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోషియమ్' సినిమాకు తెలుగులో అఫీషియల్ రీమేక్ సినిమా 'భీమ్లా నాయక్' నిర్మిస్తున్నారు. రీమేక్ సినిమా అయినప్పటికీ పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ కారణంగా ఈ రేంజ్‌లో బిజినెస్ జరిగినట్టు చెప్పుకుంటున్నారు. పవన్ రీ ఎంట్రీ సినిమా 'వకీల్ సాబ్' కూడా బాలీవుడ్ హిట్ మూవీ 'పింక్' రీమేక్‌గా రూపొందినదే. ఆ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా దాదాపు రూ. 90 కోట్ల వరకు జరిగిందని ప్రచారం జరిగింది. ఆ సినిమాతో పోల్చుకుంటే ఇప్పుడు 'భీమ్లా నాయక్' ఇంకా ఎక్కువే చేసినట్టు లెక్క. ఇక ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తుండగా..సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.