తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మండిపడ్డ మంత్రి హరీష్ రావు..

 


తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. రాష్ట్రానికి రావల్సిన నిధుల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లను వెంటనే విడుద‌ల చేయాలంటూ ఆర్థిక శాఖ మంత్రి త‌న్నీరు హ‌రీశ్‌రావు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్‌కు శనివారం మరోసారి లేఖ రాశారు. గతంలో చేసిన అభ్యర్థనలను ఈ లేఖ‌లో గుర్తు చేశారు. ఇవే అంశాలతో ఈ ఏడాది జనవరి 24న లేఖ రాసిన విషయం తెలిసిందే..