కేంద్రానికి సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మమ్మల్ని ముట్టుకుంటే అడ్రస్ లేకుండా చేస్తామని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. అవసరం అయితే ఢిల్లీ దాకా వస్తామని, దేశ రాజకీయాల్లో పాత్ర పోషించాల్సివస్తే కొట్లాడ్డానికి సిద్దమని కేసీఆర్ అన్నారు. కేంద్రం కొన్ని సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని, గోదావరి నీళ్లతో జనగామ పాదాలు కడిగేందుకు సిద్ధమని, విద్యుత్ సంస్కరణల పేరుతో మోదీ పంచాయితీ పెడుతున్నారని జనగామ బహిరంగసభలో సీఎం కేసీఆర్ అన్నారు.