తెలుగు రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ ప్రోమో విడుదల..

 తెలుగు రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ ఇప్పటివరకు విజయవంతంగా 5 సీజన్స్ ను పూర్తి చేసుకుంది. టెలికాస్ట్ ఆయన ప్రతిసారి భారీ టీఆర్పీతో దూసుకుపోయింది ఈ షో. బిగ్ బాస్ మొదటి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెల్సిందే. మొదటి సీజన్ నుంచి ఈ గేమ్ షో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఇక బిగ్ బాస్ సీజన్ 2కి నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించారు. ఆ తర్వాత నుంచి కింగ్ నాగార్జున బిగ్ బాస్ బాధ్యతలు తీసుకున్నారు సీజన్ 3,4,5 లను నాగార్జున హోస్ట్ గా వ్యవహరించి విజయవంతంగా ముగించారు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ 2 అవర్స్ ప్రేక్షకులను అలరించనుంది. అయితే ప్రేక్షకులకు ఈసారి 24 గంటల ఎంటర్‏టైన్‏మెంట్ అందించేందుకు తెలుగు బిగ్‏బాస్ ఓటీటీని తీసుకురాబోతున్నట్లుగా గతంలోనే నిర్వాహకులు ప్రకటించారు. దీంతో బిగ్‏బాస్ ఓటీటీలో పాల్గోనబోయే కంటెస్టెంట్స్ ఎవరు.. ఎప్పటినుంచి ఈ షో ప్రారంభం కాబోతుందంటూ సోషల్ మీడియాలో రోజూకో వార్త చక్కర్లు కొడుతుంది.


ఇక ఈ షో ప్రారంభం కోసం జనాలు కూడా అంతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల తెలుగు బిగ్‏బాస్ ఓటీటీ లోగో విడుదల చేశారు నిర్వాహకులు. బిగ్ బాస్ ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో వెన్నెల కిషోర్, నాగార్జున, మురళీశర్మ కనిపించారు. వెన్నెల కిషోర్ కు ఉరిశిక్ష పడటంతో అతడిని ఉరితీయడానికి తీసుకెళ్లిన సమయంలో చివరికోరిక ఏదైనా ఉందా అని అడగ్గా.. అతడి తరుపున లాయర్ అయిన నాగార్జున బిగ్ బాస్ ఒక్క ఎపిసోడ్ చూస్తాడని చెప్పడంతో ఒక గంటలోనే అయిపోతుందనుకొని పోలీస్ ఆఫీసర్ అయిన మురళీశర్మ ఒప్పుకుంటాడు.. కానీ ఎంత సేపటికి బిగ్ బాస్ పూర్తవ్వదు.. అలా వెన్నెల కిషోర్ ఉరి నుంచి తప్పించుకుంటాడు.. ఇక పై బిగ్ బాస్ ఇంటి నుంచే ఇకపై నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అని నాగార్జున చివరిలో చెప్తాడు.. డిస్నీ ప్లస్ హాట్ బిగ్ బాస్ టెలికాస్ట్ కానుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ షోలో మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తోపాటు.. కొత్తవారు కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం.