చరణ్, శంకర్ సినిమా కి రికార్డు స్థాయిలో హిందీరైట్స్ ధర..

 



మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, మేకింగ్ కింగ్ శంకర్ కాంబినేషన్ ఓ భారీ పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. చెర్రీ 15వ చిత్రంగా, దిల్ రాజు ప్రొడక్షన్స్‌లో 50వ చిత్రంగా విశేషాన్ని సంతరించుకుంది. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. తాజా షెడ్యూల్ రాజమండ్రిలో జరుగుతోంది. జూన్ నెలాఖరుకు షూటింగ్ మొత్తం పూర్తి చేయబోతున్నారు. 2023లో చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా.. జయరామ్, సునీల్, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించిన ఓ రూమర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాదాపు రూ. 170కోట్ల ఖర్చుతో నిర్మాణం జరుపుకుంటోన్న ఈ సినిమాకి భారీ ప్రీరిలీజ్ బిజినెస్ జరుగుతున్నట్టు సమాచారం. 


టైటిల్ ఇంకా ఖరారు కాకముందే .. తెలుగు రైట్స్ కోసం పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. ఇక హిందీరైట్స్ ను జీ స్డూడియోస్ దక్కించుకున్నట్టు సమాచారం. హిందీ థియేట్రికల్ రైట్స్ సహా శాలిలైట్, డిజిటల్ రైట్స్‌ను భారీ రేట్ కు దక్కించుకున్నట్టు టాక్. రికార్డు స్థాయిలో దాదాపు రూ. 350కోట్లకు పైగానే కేవలం హిందీ రైట్స్ కు ధరపలికినట్టు ప్రముఖ జాతీయ మీడియా ప్రకటించింది. ఇక ఇతర భాషల థియేట్రికల్, శాటిలైట్, డిజిటల్ రైట్స్ దిల్ రాజు వద్దనే ఉన్నాయని తెలుస్తోంది. వీటి కోసం పలు కార్పోరేట్ కంపెనీలో పోటీ పడుతున్నాయి. ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంతో రామ్ చరణ్ ఎలాగూ పెద్ద పాన్ ఇండియాస్టార్ అవుతాడు. అందుకే శంకర్ చిత్రానికి అంత ధరపలికిందని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.