తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు..

 


ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను పండగలా నిర్వహిస్తామని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ముఖ్యమంత్రి అమలు చేస్తున్న వివిధ పథకాలు రాష్ట్రంలోని అన్ని వర్గాలకు అందుతున్నాయని, అందరూ సంతోషంగా వున్నారని అన్నారు. బుధవారం మారేడ్ పల్లి లో టీఎస్ఎంఐడిసీ ఛైర్మన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాన్ని మంత్రి తలసాని ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ దేశ చరిత్రలో పోరాడి రాష్ట్రాన్ని సాధించిన మహానేత కేసీఆర్ అని అభివర్ణించారు. అభివృద్ధిలో దేశానికే తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలిపిన గొప్ప నాయకులు కేసీఆర్ అని అన్నారు.


వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి.రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు తమ తమ ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు ఉత్సాహంగా నిర్వహిస్తున్నాయని మంత్రి తెలిపారు. తన నియోజక వర్గంలో కూడా పలు ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా గురువారం పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు.