గ్రేటర్‌పై బీజేపీ ఫోకస్
గ్రేటర్‌పై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఆదివారం బీజేపీ కార్యాలయంలో కార్పొరేటర్స్, గ్రేటర్ జిల్లాల అధ్యక్షులతో బండి సంజయ్ సమావేశమయ్యారు. ఈ భేటీలో బీజేపీ నేతలు ఆశ్విన్ కుమార్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. గ్రేటర్‌లో పార్టీ బలోపేతం, టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని నిర్ణయించారు. సీఎం కేసీఆర్, మంత్రులు చేస్తున్న విమర్శలను క్షేత్రస్థాయిలో తిప్పికొట్టడం లాంటి అంశాలపై నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు.