ప్రిన్స్ మహేశ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘సర్కారువారి పాట’ చిత్రంలోని మొదటి పాట త్వరలో సందడి చేయనుంది. ‘వందో.. ఒక వెయ్యో’ అంటూ సాగే ఈ పాటను ప్రేమికుల రోజు సందర్భంగా ఈ నెల 14న విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను శుక్రవారం విడుదల చేశారు. అనంత శ్రీరామ్ రచించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. తమన్ స్వరకర్త. మే 12న విడుదల కానున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మిస్తున్నాయి. మహేశ్ సరసన కీర్తి సురేశ్ నటిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు.