ఇండియాలో జాతీయ భద్రతా కారణాలతో బ్యాటిల్ రాయల్ గారెనా ఫ్రీ ఫైర్‌ గేమ్‌ను బ్యాన్..

 జాతీయ భద్రతా కారణాలను చూపుతూ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రముఖ బ్యాటిల్ రాయల్ గేమ్ గారెనా ఫ్రీ ఫైర్‌ గేమ్‌ను ఇండియాలో నిషేధించింది.గారెనా ఫ్రీ ఫైర్‌తో పాటుగా మరొక 53 ఇతర చైనీస్ అప్లికేషన్‌లను కూడా ప్రభుత్వం నిషేధించింది. చైనాతో పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతల మధ్య చైనీస్ యాప్‌లను నిషేధించడం ఇది రెండోసారి. జాతీయ భద్రతా ప్రమాదానికి సంబంధించిన కారణాలతో నవంబర్ 2021లో భారత ప్రభుత్వం 43 యాప్‌లను నిషేధించింది.గారెనా ఫ్రీ ఫైర్ గేమ్‌

గారెనా ఫ్రీ ఫైర్ గేమ్‌ అనేది దేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన గేమ్‌లలో ఒకటి. 2021లో భారీగా డౌన్‌లోడ్ చేసుకున్న వాటిలో అధిక రేటును కలిగి ఉంది. 2020తో పోలిస్తే దీని ఇన్‌స్టాలేషన్‌లో 72% పెరుగుదలను అందుకున్నది. సెప్టెంబర్ 2020లో PUBG నిషేధం తర్వాత ఈ గేమ్ అధికంగా జనాదరణ పొందడం ప్రారంభించింది. ఇతర భారతీయ ప్రత్యర్ధుల రాక తర్వాత కూడా అగ్రస్థానంలో ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ గేమ్‌ను సింగపూర్‌కు చెందిన కంపెనీ అభివృద్ధి చేసింది. అయితే ఇతర చైనీస్ అప్లికేషన్‌లతో పాటుగా ప్రభుత్వం దీనిని కూడా నిషేదించింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.


గారెనా ఫ్రీ ఫైర్ అంటే ఏమిటి?

 


గారెనా ఫ్రీ ఫైర్‌ గేమ్‌లోని డెత్ మ్యాచ్‌లో 50 మంది ఆటగాళ్ళు ఒకరితో ఒకరు పోటీపడతారు. వారు ఎటువంటి ఆయుధాలు లేకుండా విమానం నుండి విసిరివేయబడతారు. తరువాత వారి మనుగడ కోసం ఇతర ఆటగాళ్లను చంపాలి. ఆటగాళ్లు సేకరించడానికి మ్యాప్ అంతటా ఆయుధాలు ఉంటాయి కావున ప్రత్యర్థిని చంపిన తర్వాత వారి ఆయుధాలను సేకరించవచ్చు. PUBGలో వలె అందుబాటులో ఉన్న సురక్షితమైన ప్లే ఏరియా కాలక్రమేణా తగ్గిపోతుంది. జీవించి ఉన్నవారిని ఒక గట్టి సర్కిల్‌లో పరిమితం చేస్తుంది మరియు వాటాను పెంచుతుంది. సులభమైన ప్రయాణాల కోసం వదిలివేసిన కార్లను నడపడం మరియు 10 నిమిషాల సెషన్‌లో రెండు లేదా మూడు సార్లు ఎయిర్‌డ్రాప్ చేయబడిన పురాణ సంపద మరియు సామాగ్రిని శోధించడం వంటివి ఉంటాయి. ఇందులో అన్ని బాక్స్ లు కనిపించినంత ఆకర్షణీయంగా ఉంటాయి. వాటి నుండి వచ్చే రంగురంగుల పొగ మీ స్థానాన్ని వెల్లడిస్తుంది కాబట్టి క్యాంప్ చేయడానికి మరియు మిమ్మల్ని వేటాడేందుకు పొరుగు ఆటగాళ్లకు ఇవి బహిరంగ ఆహ్వానం. ప్లేయర్‌లు గేమ్‌లలో మెరుగ్గా ఉండటానికి ప్రీమియం రివార్డ్‌లను అందించే రోజువారీ రీడీమ్ కోడ్‌లను పొందవచ్చు. ఎవరైనా ఒకరు ప్రాణాలతో మిగిలిపోయే వరకు ఆట కొనసాగుతుంది.


గారెనా ఫ్రీ ఫైర్

 


గారెనా ఫ్రీ ఫైర్ గేమ్‌ భారతదేశంలోనే కాకుండా యునైటెడ్ స్టేట్స్‌లో కూడా అత్యధిక రేటింగ్ ను పొందింది. గారెనా ఫ్రీ ఫైర్ మరియు ఇది మెరుగుపరచబడిన వెర్షన్ గారెనా ఫ్రీ ఫైర్ మాక్స్ గేమ్ ను ఆపిల్ స్టోర్ లో కూడా నిషేధించబడింది. మాక్స్ వెర్షన్ గూగుల్ ప్లే స్టోర్ లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నట్లు కనిపిస్తోంది కానీ త్వరలో తీసివేయబడే అవకాశం ఉంది.


గారెనా ఫ్రీ ఫైర్ గేమ్ యొక్క ప్రత్యామ్నాయాలు

 


BGMI మరియు PUBG న్యూ స్టేట్‌స్, PUBG మొబైల్ వంటి గేమ్ లు భారతదేశంలో తిరిగి వచ్చినందున ప్లేయర్‌లు గారెనా ఫ్రీ ఫైర్ గేమ్ కి ప్రత్యాన్మాయంగా ఉపయోగించవచ్చు. అలాగే గేమింగ్ ఔత్యాహికులు అభిమానులు కాల్ ఆఫ్ డ్యూటీని కూడా ఆడవచ్చు. అయితే బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ల కంటే గేమింగ్ కోసం గల స్మార్ట్‌ఫోన్‌లు ఎల్లప్పుడూ సున్నితమైన పనితీరును అందిస్తుందని తెలుసుకోండి.