ఏపీలో పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీని రైతుల ఖాతాల్లో జమ చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి.

 ఏపీలో పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీని అందజేస్తోంది ఏపీ సర్కార్‌. ఇవాళ క్యాంపు కార్యాలయంలో.. బటన్ నొక్కి అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి. రైతులకు 542.06 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని విడుదల చేశారు. ఎస్సార్‌ యంత్రసేవా పథకం కింద.. 1,220 రైతు గ్రూపులకు రూ.29.51 కోట్ల లబ్ధి చేకూర్చనున్నారు. మొత్తం రూ.564.28 కోట్లు విడుదల చేయనున్న సీఎం జగన్.. రైతుల ఖాతాలో నగదును జమ చేయనున్నారు. గ‌తేడాది నవంబరులో భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ అందించాలని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం నిర్ణయంచింది. ఈమేర‌కు సీఎం జగన్‌మోహ‌న్‌రెడ్డి రేపు రైతుల ఖాతాల్లోకి ఇన్ పుట్ సబ్సిడీ నిధులు జమ చేయనున్నారు.


తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో నగదును జమ చేశారు. 5,71,478 మంది రైతుల ఖాతాల్లోకి రూ.543.77 కోట్లను, అలాగే, 1220 రైతు గ్రూపులకు వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం కింద రూ.29.51 కోట్లను అందజేశారు. ఈ రెండు పథకాలకు మొత్తం రూ.564.28 కోట్లను జమచేశారు.