రేపు సీఎం కేసీఆర్ జనగామ జిల్లాలో పర్యటన..

 ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. బీజేపీ నేతలను ముందస్తుగా అరెస్టులు చేశారు. నిన్న టీఆర్ఎస్, బీజేపీ నాయకులు కొట్టుకున్న నేపథ్యంలో సీఎం పర్యటనకు బీజేపీ నాయకులు అడ్డుపడతారని ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారు. ఇవాళ జనగామలో మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ పర్యటించనున్నారు.