జాతీయ రాజకీయ ప్రవేశంపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు...

 బంగారు తెలంగాణని తయారు చేసుకున్నట్టే.. బంగారు భారతదేశాన్ని తయారుచేద్దామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. నారాయణఖేడ్‌‌లో నిర్వహించిన  బహిరంగసభలో కేసీఆర్ మాట్లాడుతూ జాతీయ రాజకీయ ప్రవేశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో దుర్మార్గమైన మత రాజకీయాలు నడుస్తున్నాయని ధ్వజమెత్తారు. మత రాజకీయాలు చేసేవారికి ప్రజలే బుద్ధి చెప్పాలని హెచ్చరించారు. తెలంగాణ మాదిరిగా దేశాన్ని అభివృద్ధి చేద్దామన్నారు. జాతీయ రాజకీయాల్లోకి ఢిల్లీ దాకా కొట్లాడుదామా? అని ప్రశ్నించారు. తాను పోరాటానికి బయల్దేరానని, మీ అందరి దీవెన ఇదే విధంగా ఉండాలని కేసీఆర్‌ కోరారు. 

‘బీజేపీ ముక్త్‌ భారత్‌’ అంటూ నినదించిన కేసీఆర్‌ జాతీయ స్థాయిలో వేదిక ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ప్రధాని మోదీ వ్యతిరేక కూటమి కట్టే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. బీజేపీ, కాంగ్రేసేతర పార్టీలతో జత కట్టేందుకు దేశాన్ని చుట్టేయాలని అనుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆదివారంలో ముంబైలో పర్యటించారు. తొలుత ఆయన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేతో సమావేశమయ్యారు. తదుపరి ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌తోనూ భేటీ అయ్యారు. కేసీఆర్ పర్యటన విజయవంతమైందని టీఆర్‌ఎస్ శ్రేణులు చెబుతున్నాయి.