సర్కారు వారి పాట సినిమా నుండి కళావతి పూర్తి పాట విడుదల..

 సూపర్ స్టార్ మహేష్ బాబు .. కీర్తి సురేష్  జంటగా నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం సర్కారు వారి పాట. డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియోస్ మూవీపై మరింత ఆసక్తిని క్రియేట్ చేశాయి. ఇక ఇప్పటికే విడుదలైన కళావతి సాంగ్ ప్రోమోకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇందులో మహేష్ పూర్తిగా స్టైలీష్ అండ్ హ్యాండ్స‏మ్ లుక్‏లో కనిపిస్తున్నాడు. దీంతో సర్కారు వారి పాట చిత్రాన్ని బిగ్ స్క్రీన్ పై చూసేందుకు ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.


తాజాగా ఈ సినిమా నుంచి కళావతి పూర్తి పాటను సోషల్ మీడియాలో విడుదల చేసింది చిత్రయూనిట్. వందో.. ఒక వెయ్యో అంటూ సాగే ఈ మెలోడి సాంగ్ శ్రోతలను ఆకట్టుకుంటుంది. ఇందులో మహేష్ మరింత స్టైలీష్‏గా కనిపిస్తున్నాడు. ఈ పాటను ప్రముఖ సింగర్ సిధ్ శ్రీరామ్ ఆలపించగా.. తమన్ సంగీతం అందించారు. అయితే ఈ పాటను ముందుగా వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేమికుల రోజున విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. అయితే నిన్న సాయంత్రం అనుహ్యంగా ఈ సాంగ్ పూర్తిగా సోషల్ మీడియాలో లీక్ అయ్యి షాకిచ్చింది. మొదటి నుంచి సినిమాకు లీకుల బెడద తప్పడం లేదు. గతంలో టీజర్ లీక్ కాగా.. నిన్న కళావతి సాంగ్ లీక్ అయ్యింది. దీంతో మహేష్ ఫ్యాన్స్..మైత్రీ మూవీ మేకర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మేకర్స్ కాదు.. లీకర్స్ అని.. సర్కారు వారి పాట సినిమా విషయంలో అజాగ్రత్తగా ఉండడం సరైనది కాదంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా సూచిస్తున్నారు.


ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, GMB ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వేసవిలో మే 12న విడుదల చేయనున్నారు. కాసేపటి క్రితం విడుదలైన కళావతి పాటకు భారీగా రెస్పాన్స్ వస్తోంది.