'రాధే శ్యామ్' సినిమా నుండి బిగ్ అప్డేట్..

 


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'రాధే శ్యామ్'. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 2022 మార్చి 11న భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. ఇక విడుదల తేదీకి రెండు వారాలు మాత్రమే సమయం ఉంది. అయినా మేకర్స్ ప్రమోషనల్ కార్యక్రమాలలో జోరు పెంచడం లేదని.. ప్రమోషనల్ కంటెంట్ కూడా రిలీజ్ చేయడం లేదని డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ నిర్మాతలను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. 'రాధేశ్యామ్' చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన టీజర్ - ట్రైలర్ - నాలుగు పాటలు అభిమానులను, అన్నీ వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రాజెక్ట్ మొదలైనప్పుడు మేకర్స్ నుంచి ఆశించినంత స్పీడ్‌గా అప్‌డేట్స్ రాకపోయినప్పటికీ.. ఆ తర్వాత మాత్రం ప్రభాస్, పూజా హెగ్డేల పోస్టర్స్ చాలానే వదిలారు. ఫస్ట్ గ్లింప్స్ అని..టీజర్స్ అని ట్రైలర్ అని మేకర్స్ అభిమానులను బాగానే ఖుషీ చేశారు. కానీ, తీరా రిలీజ్ సమయం దగ్గరపడుతున్నప్పుడు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టున్నారని ఫ్యాన్సే ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు 'రాధేశ్యామ్' చిత్రబృందం కొత్త ప్రమోషనల్ కంటెంట్ రెడీ చేసిందట. ఇప్పటికే కొత్త ట్రైలర్‌ను కూడా కట్ చేయడంతో పాటు..సినిమాకు సంబంధించిన ఓ మేకింగ్ వీడియోను రెడీ చేస్తున్నారట. అలాగే, ఐదో పాటను కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.